8 July, 2026 | 4:39 PM

ఎఫ్‌పీఐ పెట్టుబడులు

13-05-2024 12:05 AM

మే నెలలో తొలి రెండు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీల్లో రూ.1,156 కోట్లు నికర పెట్టుబడి చేసినప్పటికీ, తదుపరి వరుస అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో మే నెలలో ఇప్పటివరకూ రూ.17,000 కోట్లు  మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లయ్యింది. యూఎస్ బాండ్ ఈల్డ్స్‌లో మార్పులకు అనుగుణంగా ఎఫ్‌పీఐలు స్పందిస్తారని, ఈల్డ్స్ తగ్గితే భారత్ మార్కెట్లో వారు తిరిగి భారీ కొనుగోళ్లు జరుపుతారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ వివరించారు.