మార్కెట్లోకి 6 ఐపీవోలు, 12 లిస్టింగ్స్
13-05-2024 12:05 AM
న్యూఢిల్లీ, మే 12: ఈ వారం ప్రైమరీ మార్కెట్లోని 6 తొలి పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) ప్రవేశించనున్నాయి. ఇందులో ఒకటి మెయిన్ ఐపీవోకాగా, మిగిలిన ఐదు చిన్న, మధ్యతరహా కంపెనీల ఇష్యూలు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మలకు పెట్టుబడులు ఉన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఆఫర్ మే 15న ప్రారంభమై 17న ముగుస్తుంది. రూ.2,615 కోట్ల సమీకరణకు వస్తున్న ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,125 కోట్ల విలువైన 4.14 కోట్ల షేర్లను తాజా ఈక్విటీగా జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.1,489 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. ఐపీవో ధరల శ్రేణిని రూ.258 నిర్ణయించారు.






