12 June, 2026 | 1:23 AM

పెళ్లి పేరుతో.. సహజీవనం

12-06-2026 12:00 AM

రూ.40 లక్షలు నగదు, బంగారం తీసుకొని దూరమయ్యాడని మహిళ ఆరోపణ

మేడిపల్లి, జూన్ 11 (విజయక్రాంతి): ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెతో సహజీవనం చేసి రూ.40 లక్షలు నగదు, బంగారం తీసుకొని మోసం చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్, ఉదయ్ నగర్ కు చెందిన సిస్టు వెంకటభారతి, భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా నివసిస్తుంది.

సోషల్ మీడియా ద్వారా  2019లో భారతికి, షేక్ మహబూబ్ హుస్సేన్ తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారి, సహజీవనం చేశామని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రూ.40 లక్షల నగదు, 2.50 తు లాల బంగారం తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. అతను కొంతకాలంగా వేరే ఆమె తో సంబంధం కొనసాగిస్తున్న విషయం తనకు తెలిసిందని, అప్పటినుండి తనను పట్టించుకోవడం లేదని, మోసoచేశాడని భారతి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.