12 June, 2026 | 1:24 AM

లడాఖ్‌కు బైక్ యాత్ర

12-06-2026 12:00 AM
  1. జెండా ఊపి ప్రారంభించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
  2. మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ లడాఖ్ బైక్ యాత్ర
  3. ముషీరాబాద్ విద్యార్థిని మెట్టు భాందవి బైక్ యాత్ర

ముషీరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గంలోని కళాధర్ నగర్ కు చెందిన విద్యార్థిని హైదరాబాద్ నుంచి లడాఖ్ కు బైక్ పై సాహస యాత్రను చేపట్టింది. గురువారం ముషీరాబాద్ నుంచి లడాఖ్ మోటార్ సైకిల్ పై బయల్దేరిన భాందవిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించి బైక్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ నేటి యువత కళలు కనడమే కాకుండా వాటిని సహకారం చేసుకునేందుకు కృషిచేయాలని సూచించారు.

భాందవి చేపట్టిన సహాసయాత్ర యువతలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు. మెట్టు భాందవి మాట్లాడుతూ బైక్ అండ్ టూరింగ్ కంపెనీ, మ్యాడ్ ఓవర్ లడాఖ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో పాల్గొనే పది మంది రైడర్లలో తనకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి యాత్రలు ముందు ముందు మరిన్ని చేపట్టేందుకు ఈ బైక్ యాత్ర ఎంతో దోహదపడుతుందని తెలిపారు. నగరం లోని అరోరా యూనివర్శిటీలో ఎల్‌ఎల్బి విద్యను అభ్యసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్, బీజేపీ నాయకులు ఎం. నవీన్ గౌడ్, మెట్టు వాసు తదితరులు పాల్గొన్నారు.