31 July, 2026 | 2:33 PM

పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం

31-07-2026 01:24 PM

బాన్సువాడ, జూలై 31 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోనీ పాత బాన్సువాడ పల్లె దవాఖానను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో రోగులకు అందుతున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.అవసరమైన మందులు, సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలను సమీక్షిస్తూ, రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.