18 March, 2026 | 6:14 AM

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు పెట్రోల్ బంక్‌లు ఇప్పిస్తామని మోసం

18-03-2026 12:00 AM

జనగామ, మార్చి 17 (విజయక్రాంతి): చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మోసం చేసిన తీరు నిందితుడు బెలిగిని శివ కుమార్ జనగామ పట్టణంలో పురోహితుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన వృత్తి కారణంగా పంచాంగం, పెళ్లి ముహూర్తాలు తదితర విషయాల కోసం తన వద్దకు వచ్చే అమాయక ప్రజలతో పరిచయం పెంచుకుని, వారికి నమ్మకం కలిగించే విధంగా ప్రవర్తించేవాడు.

ఈ క్రమంలో అతను తనకు ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు మరియు పోలీస్ శాఖ అధికారులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని అబద్ధంగా చెప్పి ప్రజలను నమ్మబలికాడు. ముఖ్యంగా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్ మరియు పోలీస్ శాఖలో సజ్జనార్ ఐపిఎస్ తనకు తెలిసినవారని చెప్పి విశ్వాసం కలిగించేవాడు. ఇంకా తాను జనగామలో పెట్రోల్ బంక్ ప్రారంభించబోతున్నానని, అలాగే ఉద్యోగాలు కూడా ఇప్పించగలనని చెప్పి ప్రజలను ఆకర్షించాడు.

ఎవరికైనా ఉద్యోగం కావాలన్నా, వ్యాపార అవకాశాలు కావాలన్నా తనను సంప్రదించమని చెప్పి వారి నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. ఈ విధంగా మోసపూరితంగా సేకరించిన డబ్బులను తన అల్లుడు సాయి చరణ్, ఇల్లందుల శ్రీనివాస్ మరియు దరావత్ రాజేష్లకు పంపించేవాడు.

అనంతరం ఈ నలుగురు కలిసి ఆ డబ్బులను తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుని, విలాసవంతమైన జీవితం గడిపినారు. ఈ విధంగా నిందితులు కలిసి కుట్రపూర్వకంగా అమాయక ప్రజలను ఉద్యోగాలు మరియు పెట్రోల్ బంక్లు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి, వారి నుండి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు అని తెలిపారు.