తెలంగాణలో స్వేచ్ఛా వాయువులు
1947లో భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం సాధించినప్పటికీ.. తెలంగాణ, మరాఠా, కన్నడ ప్రాంతా లతో కూడిన హైదరాబాద్ సంస్థానం ని జాం పాలనలో కొంతకాలం స్వతంత్ర రా జ్యంగా కొనసాగింది. వీరి భూస్వామ్య ఆధారిత ఆర్థిక వ్యవస్థ కారణంగా రైతులపై భారీ పన్నులు, బలవంతపు వసూళ్లు, వెట్టి చాకిరీల రూపంలో దోపిడీల పర్వం కొనసాగింది.
ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా 1946లో మొదలైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములై నిజాం సర్కారుపై స్వేచ్ఛా వా యువుల కోసం తిరుగుబాటు బావుటా ఎ గురవేశారు. ఈ పోరాటం భూ సంస్కరణలు, సామాజిక సమానత్వం కోసం శక్తి వంతమైన ఉద్యమంగా మారింది. భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ట్లే, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆ ంధ్ర మహాసభ తెలంగాణలో స్థానిక స్వపరిపాలన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం పోరాడింది.
హైదరాబాద్ సంస్థానాన్ని అసఫ్ జాహీ వంశస్థులు 1724 ను ంచి 1948 వరకు పాలించారు. చివరి నిజాం.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాం లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు, నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయ త్ సాగర్ వంటి జలాశయాలను నిర్మించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పటికీ, రజాకార్ల దాష్టికాల వల్ల నిజాం నవాబుకు అపఖ్యాతి దక్కిందని చెప్పవచ్చు.
1947 నాటికి హైదరాబాద్ సంస్థానం 82 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో 1.6 కోట్ల జనాభాతో ఉండేది. ఇం దులో తెలంగాణ ఎనిమిది జిల్లాలతో దా దాపు 90 లక్షల జనాభా ఉండగా, మరాఠ్వాడ ప్రాంతం ఐదు జిల్లాలతో, కన్నడ మాట్లాడే వారు మూడు జిల్లాల్లో నివసించేవారు. నిజాం ఏలుబడిలో ఉర్దూ అధికా రిక భాషగా ఉండేది. మెజార్టీ ప్రజలుగా ఉన్న హిందువులపై భాషా, సాంస్కృతిక ఒత్తిడి పెరిగిపోయింది.
కొమురయ్య మరణంతో
1946లో దొడ్డి కొమురయ్య మరణం తర్వాత పెల్లుబికిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.. నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి త్వరితగతినే తెలంగాణలోని వేలాది గ్రామాలకు విస్తరించింది. నిజాం ప్రభుత్వం ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లను సృష్టించి, గ్రామాలపై దాడు లు చేస్తూ దమనకాండ సాగించింది. పరకాలలో 1947 సెప్టెంబర్ 2న జాతీయ జెం డా ఎగురవేస్తున్న సందర్భంలో అక్కడున్న ప్రజలపై జరిగిన ఘాతుకం మరో జలియన్ వాలాబాగ్‌ను తలపించింది.
ప్రస్తుత జనగామ నియోజకవర్గంలోని వీర బైరాన్‌పల్లిలో 1948 ఆగస్టు 27న రజాకార్లు వందలాది మందిని హతమార్చిన ఘటనతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా పలు గ్రామాల్లో జరిగిన దాడులు నాటి నెత్తుటి మరకలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ఆంధ్ర మహాసభ.. హైదరాబాద్ సంస్థానంలో మొదట తెలుగు భాషా, సాంస్కృ తిక హక్కుల కోసం సాహిత్య ఉద్యమంగా ప్రారంభమైంది. 1930లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది.
1946లో ఉదృతమైన తెలంగాణ రైతాంగ పోరాటానికి ఆంధ్ర మహాసభ నాయకత్వమే వెన్నుదన్నుగా నిలిచింది. కార్యాచరణలో భాగంగా భూసంస్కరణలు, సామాజిక సమానత్వం కోసం పోరాడుతూ కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసింది. రావి నారాయణరెడ్డి, మాగ్దూమ్ మొహియుద్దీన్, భీంరెడ్డి నరసింహరెడ్డి వంటి నాయకులు.
ఈ ఉద్యమంలో ముందుండి భూ స్వాముల నుంచి పంటలతో పాటు భూ ములను కూడా స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఆరుట్ల కమలాదేవి, వీరనారి చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొనడం సామాజిక సమాన త్వానికి నిదర్శనం. వీరందరి పోరాటం మలి దశ ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచిందనడంలో సందేహం లేదు.
విప్లవ మార్గంలో
స్వాతంత్య్ర సంగ్రామంలో మితవాద, అతివాద పోరాటాల తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసావాదం, సత్యాగ్రహాలు, స్వదేశీ ఉద్యమాల ద్వారా బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసింది. ఇదే విధంగా తెలం గాణలో ఆంధ్ర మహాసభ.. నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరే కంగా సాయుధ పోరాట రూపంలో పోరాడింది.
నాడు కాంగ్రెస్ అహింసావాదంపై ఆధారపడితే, ఆంధ్ర మహాసభ విప్లవ భావజాలంతో కూడిన మార్గాన్ని ఎంచుకుంది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో స హకరించినప్పటికీ, మహాసభ భూసంస్కరణలపై ఎక్కువగా దృష్టి సారించింది. స్వా తంత్య్రం వచ్చిన తర్వాత, ఐదు వందలకు పైగా సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనమయ్యాయి. కానీ నిజాం మీర్ ఉ స్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ స్వతంత్రం గా ఉంటుందంటూ, భారత్‌లో విలీనం చేయడానికి ససేమిరా అన్నందున, నాటి ఉప ప్రధాని, కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ప్రారంభమైంది.
మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నా యకత్వంలో భారత సైన్యం ఐదు రోజుల్లోనే నిజాం సైన్యాన్ని, రజాకార్లను ఓడిం చింది. సెప్టెంబర్ 17న నిజాం ఓటమిని అంగీకరించి భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీనాన్ని ప్రకటించాడు. 1950 లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, 1956లో భాషా ప్రాతిపదికన తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌తో కలిసింది. సెప్టెంబర్ 17 రోజును నాటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఐదు మరాఠా జిల్లాలు మహారాష్ర్టలో కలిసినందున అక్కడ మరాఠ్వాడా ముక్తి సంగ్రామ దినోత్సవంగా జరుపుతున్నారు. మూడు కన్నడ జిల్లాలు కర్ణాటకలో కలిసినందున కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవంగా జరుపుతున్నారు.
ఉద్యమ స్ఫూర్తితో
కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని జరుపలేదు. ఈ విధమైన చర్యల వల్ల ఇక్క డి ప్రజల ఆత్మగౌరవంతో పాటు స్వీయ అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. ఆఖరికి ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ ప్రజా ప్ర యోజనాలకు విరుద్ధంగా నీళ్లు, నిధులు, నియామకాల కేటాయింపుల్లో జరిగిన అన్యాయాల వల్ల.. తెలంగాణ సాయుధ రై తాంగ పోరాట స్ఫూర్తితో 1969లో తొలి దశ, 2009లో మలి దశ ఉద్యమాల ఫలి తం,
వందలాది మంది అమరుల త్యాగాల పునాదుల మీద 2014 జూన్ 2న తెలంగా ణ రాష్ర్టం అవతరించింది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, ఇతర రాష్ట్రాల నుంచి విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చే వారితో ఆత్మీయంగా మెలిగే గొప్ప మనసు ఇక్కడి ప్రజలది. రాష్ర్టంలో ని ఏ మారుమూల పల్లెకు వెళ్లినా కుల, మతాలకు అతీతంగా, ఆప్యాయంగా పలకరించుకుంటూ ఒకరి కష్ట సుఖాల్లో మరొ కరు తోడుగా నిలిచే తీరు తెలంగాణకే ప్ర త్యేకమని చెప్పవచ్చు. అణిచివేతను ధిక్కరించి ఆత్మగౌరవంతో పోరాడే తత్వం ఈ మట్టిలోనే ఉన్నది.
ఆ పోరాట స్ఫూర్తిని కొ నసాగిస్తూ, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు పయనిం చాలని ఆశిద్దాం. సెప్టెంబర్ 17ను కొన్ని రా జకీయ పార్టీలు విమోచన దినోత్సవం గా, మరికొన్ని విలీన దినంగా పాటించినప్పటికీ, నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలుకుతూ, భారత యూనియన్‌లో కలిసి న తెలంగాణకు పూర్తి స్వాతం త్య్రం వచ్చిం ది మాత్రం ఈ రోజునే అని చెప్పొచ్చు.
రా ష్ర్ట ఏర్పాటు తర్వాత గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం జాతీయ సమైక్యతా దినోత్సవం పేరు తో కార్యక్రమాలను నిర్వహించగా.. ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా వేడుకలు జరుపుతోంది. ఏ పేరు తో పిలిచినా, పార్టీలకు అతీతంగా సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి తెలంగాణ వి ముక్తి, స్వేచ్ఛా వాయువుల కోసం అసువు లు బాసిన అమరువీరులను స్మరించుకోవాల్సిన సమయమిది. జైహింద్.
వ్యాసకర్త సెల్ : 9959046499






