calender_icon.png 18 September, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాం నిరంకుశత్వానికి ముగింపు పలికిన రోజు

17-09-2025 12:00:00 AM

డా. విజయ భాస్కర్ :

మన దేశానికి బ్రిటీష్ సామ్రాజ్య వాదుల నుంచి 1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ తెలంగాణకు మాత్రం స్వతంత్రం దక్కలేదు. అప్పటికీ 560కి పైగా సంస్థానాలను రాజులు పరిపాలించేవారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో నిజాంల నిరంకుశ, నియంతృత్వ పరిపాలన సాగేది. ఖాసీం రజ్వీ ప్రజలను ఊచకోత కోస్తూ రాక్షసుడిలా ప్రవర్తించేవాడు. ప్రజలు విసిగి, వేసారి సామాన్య ప్రజలు తిరగబడ్డారు.

కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం చేశారు. భైరాన్‌పల్లి, ఖిైరాన్‌పల్లి షాపూర్, కడవెండి, సంస్థాన్ నారాయణ పుర్‌లలో..  జాగిర్దార్లు, జమీందార్లు, పటేల్, పట్వారీలు, భూస్వాములపై తిరగబడి ఆయా గ్రామాలకు విముక్తి ప్రకటించారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మోహియుద్దీన్, చంద్ర రాజేశ్వర రావు, పుచ్చల పల్లి సుందరయ్య, ఆరుట్ల కమ లాదేవి, మల్లు స్వరాజ్యం, చాకలి ఐలమ్మ, గడ్డంపల్లి లింగోజి, నానమ్మబాయి, భూంపల్లి శంకర్, మాణిక్ రావు అనేక మంది తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడగా..

అనేక మంది అమరులయ్యారు. చాలా మంది తమ ఆస్తులను, ప్రాణాలను, భూములను పోగొట్టుకున్నారు. ఎంతో మంది తమ భవిష్యత్తును వదులుకొని తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని జైలు పాలయ్యారు. నిజాం ప్రైవేటు సైన్యాధికారి ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు ప్రజలను ఊచకోత కోశారు. రజాకార్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుడా పోయింది. ప్రజలు పండించిన పంటలను దోచుకున్నారు.

ప్రతి వస్తువుపై పన్నుల రూపంలో వసూలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో 1948 సెప్టెంబర్ 17న అప్పటి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ నిర్వహించి హైదరాబాద్‌ను మన దేశంలో కలుపుకున్నారు. తెలంగాణ రాష్ర్టం అంటే ఇప్పటి 33 జిల్లాలు కాదు.

కర్ణాటక, మహారాష్ర్టలోని కొన్ని ప్రాంతాలు కలిసి ఉండేవి. కర్ణాటక, మహారాష్ర్టలు సెప్టెంబర్ 17ను అధికారిక దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం సెప్టెంబర్ 17ను విలీనమని, విమోచనమని, విద్రోహమ ని, ప్రజాపాలన దినోత్సవమంటూ రకరకాల పేర్లతో జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారణమైన బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఏనాడు సెప్టెంబర్ 17ను అధికారిక దినోత్సవంగా నిర్వహించలేదు.

నిజాం నిరంకుశత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సెప్టెంబర్ 17ను ఏ దినోత్సవంగా జరుపుకోవాలనేది చర్చనీయాంశం గా మారింది. అయితే సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రానికి అసలు సిసలైన స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పడంలో ఎలాంటి సం దేహం లేదు.

ఈసారి సెప్టెంబర్ 17ను బీజేపీ పార్టీ విమోచన దినోత్సవంగా, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవంగా జ రపడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే రేపటి తరానికి సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతకు సంబంధించి సరైన సమాచారం అందించాల్సిన అవసరం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉంది.