16-09-2025 12:00:00 AM
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇమ్మిగ్రేషన్ ఒక సున్నితమైన అంశం. గత కొన్ని దశాబ్దాలుగా, యూకేలోకి వలస వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మార్పులను తీసుకొచ్చింది. కొందరు ఈ వలసలను ఆర్థిక వృద్ధికి అలాగే బహుళ సాంస్కృతిక సమాజానికి ఒక అవకాశంగా భావిస్తున్నారు.
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) రాజధాని లం డన్‌లో వలసదారులను వెనక్కి పంపాలంటూ దేశ ప్రజలు ఆదివారం చేపట్టిన భారీ నిరసన ర్యాలీ రాజకీయ, సామాజిక చర్చలకు తెర లేపింది. ఈ నిరసన ఆధుని క కాలంలో యూకేలో జరిగిన అతిపెద్ద రై ట్-వింగ్ ర్యా లీగా చెప్పుకోవచ్చు. టామీ రా బిన్సన్ నే తృత్వంలో జరిగిన ‘యూనైట్ ది కింగ్‌డమ్’ మార్చ్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించారు.
ఈ ర్యా లీలో సుమారు 1.10 నుంచి 1.15 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. మరోవైపు జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ అనే నిరసన కూడా ఇదే లండన్ వీధుల్లో చేపట్టారు. దీనిలో సుమారు 5 వేల మంది పాల్గొన్నారు. అయితే ఈ రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీగా పోలీ సులు మోహరించారు. ఈ క్రమంలో నీళ్ల సీసాలు, పలు రకాల వస్తువులతో ఆందోళనకారులు పోలీసులుపై దాడులు చేశారు.
ఫలితంగా 25 మంది అరెస్టవ్వగా.. 26 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. కాగా రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన యునైటెడ్ ది కింగ్‌డమ్’ మార్చ్‌కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వీడియో లింక్ ద్వారా మద్దతు పలికారు. బ్రిటన్ ప్రజలను పోరాడమని మ స్క్ పిలుపునివ్వడం ఆసక్తిరంగా మారింది.
వలసలు పెరిగిన వేళ
యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇమ్మిగ్రేషన్ ఒక సున్నితమైన అంశం. గత కొన్ని దశాబ్దాలుగా, యూకేలోకి వలస వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మార్పులను తీసుకొచ్చింది. కొందరు ఈ వలసలను ఆర్థిక వృద్ధికి అలాగే బహుళ సాంస్కృతిక సమాజానికి ఒక అవకాశంగా భావిస్తుండగా.. మరికొందరు ఇది స్థానిక ఉపాధి అవకాశాలు, ప్రజా సేవలు, సాంస్కృతిక గుర్తింపుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
ఈ విభజన రాజ కీయంగా రైట్-వింగ్, లెఫ్ట్-వింగ్ గ్రూపుల మధ్య తీవ్రమైన చర్చలకు దారితీసింది. టామీ రాబిన్సన్, ఒక ప్రముఖ రైట్-వింగ్ యాక్టివిస్ట్, ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ పేరు ప్రఖ్యాతలు సా ధించాడు. అతను నిర్వహించిన ‘యూనైట్ ది కింగ్‌డమ్’ మార్చ్.. ఇమ్మిగ్రేషన్‌ను నియంత్రించాలని, సరిహద్దు నియంత్రణలను కఠినతరం చేయాలనేదే ఉద్యమం ముఖ్య ఉద్దేశం.
ఈ నిరసనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మార్చ్‌లో పాల్గొ న్న వారు ఇమ్మిగ్రేషన్ విధానాలను సంస్కరించాలని, అక్రమ వలసలను అరికట్టాల ని డిమాండ్ చేశారు. వారు బ్రిటన్ సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవాలని, స్థానిక పౌరులకు ఉపాధితో పాటు సామాజిక సేవల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వాదించారు. ఈ నిరసనకు టామీ రాబిన్సన్ నాయకత్వం అతని నాయకత్వ చాతుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శరణార్థులకు అండగా..
ఇదే సమయంలో శరణార్థులకు మద్దతుగా ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ అనే సం స్థ నాయకత్వంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో పాల్గొన్నవారు శరణార్థులకు మా నవీయ సహాయం అందించాలని, ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత సానుకూలం గా ఉండాలని కోరడంతో పాటు సమాజ ంలో సమానత్వం, ఐక్యతను ప్రోత్సహించాలని కోరారు.
వివిధ జాతులు, స ంస్కృతుల ప్రజలు ఒకే దేశంలో సామరస్యంగా జీవించాలని వారు పిలుపుని చ్చారు. ప్లకార్డులు, బ్యానర్లతో నినాదాలు చేస్తూ, జాత్యాహంకార వివక్షను ఖండిస్తూ ముందుకు సాగారు. అయితే లండన్ వీధుల్లో రెండు గ్రూప్‌ల మధ్య భావజాల వైరుధ్యం స్పష్టంగా కనిపించింది. ఇది యూకేలో ఇమ్మిగ్రేషన్ విధానంపై విభిన్న దృక్కోణాలను ప్రతిభింబిస్తుంది.
రాజకీయ -ప్రభావమెంత?
ఈ నిరసన యూకేలో ఇమ్మిగ్రేషన్‌పై ఉన్న లోతైన విభజనను స్పష్టంగా చూపించింది. రైట్-వింగ్ గ్రూపులు తమ డిమాం డ్లను మరింత గట్టిగా వినిపించడానికి ఈ ర్యాలీని ఒక వేదికగా ఉపయోగించుకున్నా యి. అయితే మరోవైపు ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ అనే సంస్థ నిర్వహించిన ప్రతి నిరసనలు మానవీయ విలువలతో పాటు శరణార్థుల హక్కులను రక్షించాలనే సందేశాన్ని బలంగా చాటి చెప్పింది.
ఈ రెండు గుండెల మధ్య జరిగిన ఘర్షణలు రాజకీయపరమైన అంశాలకు, తీవ్రమైన చర్చల కు దారి తీసిందని పలువురు అభిప్రా యపడుతున్నారు.ఈ సంఘటన యూకే ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచడంతో పాటు ఇమ్మిగ్రేషన్ విధానాలను సమీక్షించడం, స రిహద్దు నియంత్రణలను బలోపేతం చే యడం లేదా శరణార్థులకు మరింత మానవీయ విధానాన్ని అవలంభించడం వంటి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం ఒక సమతుల్య విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ నిరసనలు సామాజిక ఐక్యతపై కూడా ప్రభావం చూపవచ్చు.
అంతేకాదు ఇవి విభజన రేఖలను మరింత స్పష్టం చేశాయి. ‘యూనైట్ ది కింగ్‌డమ్’ మార్చ్.. యూకేలో ఇమ్మిగ్రేషన్‌పై ఉన్న సంక్లిష్టమైన భావజాల ఘర్షణలను స్పష్టంగా చూపిస్తుంది. టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ రైట్-వింగ్ నిరసన, ఇమ్మిగ్రేషన్ విధానాలపై ఆసక్తికరమైన చర్చలను కూడా రేకెత్తించి ంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పరోక్షంగా పాల్గొనడం ఈ సంఘటనకు అ ంతర్జాతీయ దృష్టిని తీసుకొచ్చింది.
అ యితే, హింసాత్మక ఘర్షణలు, అరెస్టుల ప ర్వం ఈ అంశానికి సంబంధించిన సున్నితత్వాన్ని, సామాజిక ఐక్యతకు ఉన్న స వాళ్లను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఈ స ంఘటన యూకే రాజకీయాలలో ఒక ము ఖ్యమైన ఘట్టంగా నిలిచిపోవడమే గాక, భవిష్యత్తులో ఇమ్మిగ్రేషన్ విధానాలపై చర్చలను మరింత లోతుగా ప్రభావితం చేసే అవకాశముంది.