విద్యుదాఘాతంతో యువకుడు మృతి
23-04-2026 03:14 PM
బాన్సువాడ, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ (26) యువకుడు విద్యుదాఘాతానికి గురై గురువారం ఉదయం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం మహేష్ అద్దె ఇంట్లో నివసిస్తూ ఉండగా విద్యుత్ సంబంధిత సమస్య ఉండడంతో దానిని స్వయంగా సరిచేయడానికి ప్రయత్నించగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే మహేష్‌ను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






