30 June, 2026 | 8:43 PM

Breaking News

పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •  

భగవద్గీత పుస్తకాల ఉచిత పంపిణీ

25-06-2025 12:03 AM

ఉయ్యూరు కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహణ

గుంటూరు, జూన్ 24 (విజయక్రాంతి): విశ్వం యొక్క జ్ఞానమంతా భగవద్గీతలో నిండి ఉన్నదని ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కాపుల రామాలయం వద్ద ఏర్పాటుచేసిన మహాభారత ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

దుఃఖా నికి కలవరం చెందని వ్యక్తి, సుఖం కోసం పాకులాడని వ్యక్తి, అనుబంధాలు, భయం, కోపం వంటివి అధికంగా చూపించని వ్యక్తి జ్ఞానితో సమానమని చెప్పే గొప్ప ఇతిహాసమే భగవద్గీత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత లోని శ్లోకాలను చదివి, వాటిని అర్థం చేసుకొని పరమాత్ముడికి దగ్గరగా జీవించాలని తెలిపారు. తదుపరి భక్తులకు ఉచితంగా భగవద్గీత పుస్తకాలను అందజేశారు.