30 June, 2026 | 9:49 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం

25-06-2025 12:05 AM

ఏపీ సీఎం చంద్రబాబు 

అమరావతి, జూన్ 24 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌క్రాస్ చేస్తున్న సేవలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసిస్తూ మరిన్ని సేవలు అందించాలని ఆకాం క్షించారు.

వైద్యశాఖ మంత్రి వై సత్యకుమార్‌యాదవ్ సమక్షంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు, రాష్ట్ర కోశాధికారి పి రామచంద్రరాజులు మంగళవారం సీఎంను కలసి అమరావతి రాజధాని ప్రాంతంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ కోసం ప్రాధాన్యత గల ప్రాం తంలో భూమిని కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్‌క్రాస్ వాహనాలపై రహదారి పన్ను మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు.