జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కల్పించాలి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వినతిపత్రం అందచేత
వనపర్తి, టౌన్ జూన్ 12 (విజయక్రాంతి): జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఒకరికి ఉచిత విద్య, మరొకరికి కనీసం 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నాయకులు జిల్లా కలెక్టర్, డీఈఓలకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో విద్యా ఖర్చులు భారంగా మారుతున్నాయని సంఘం ప్రతినిధులు తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరంలో రాయితీలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి. మాధవరావు, కార్యదర్శి బి. రాజు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి నర్సింహా రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కమల్ రెహమాన్ యూనియన్ నాయకులు రాజేందర్, ధనుష్, నరేష్ గౌడ్, మహేష్, కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, గోపాలకృష్ణ, రాజకుమార్ నగేష్, మనోహర్, లోకేష్, తదితరులు పాల్గొన్నారు






