7 May, 2026 | 1:22 AM

రెనే హాస్పిటల్‌లో 18 మందికి ఉచితంగా కీళ్ల మార్పిడి

07-05-2026 12:39 AM

కరీంనగర్ క్రైం, మే 6, (విజయక్రాంతి) ప్రొఫెసర్ డా. బంగారి స్వామి, డా. బంగారి రజని ప్రియదర్శిని ఆధ్వర్యంలో రెనే హాస్పిటల్, లక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మోకాలి కీళ్ల మార్పిడి శిబిరం విజయవంతమైంది. ఎంపిక చేయబడిన 18 మంది బాధితులకు శస్త్రచికిత్సలు పూర్తి చేసి, బుధవారం వారిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ప్రతి ఏటా నిర్వహించినట్టే, ఈ సంవత్సరం కూడా రెనే వైద్య సంస్థల అధినేత ప్రొఫెసర్ డాక్టర్ బంగారు స్వామి తన తల్లిదండ్రుల పేరు మీద నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా ఆరోసారి ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన జాన్సన్ అండ్ జాన్సన్ వేల్లీస్ కంపెనీ రోబోటిక్ విధానం ద్వారా 8 మందికి, కొన్ని వైద్యపరమైన కారణాల వల్ల మిగతా వారికి సాధారణ పద్ధతిలో పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  వైద్య బృందం సభ్యులు డాక్టర్ మునిష్, డాక్టర్ కృష్ణారెడ్డి, డా. లతీష్ రెడ్డి, డా. సురేష్ కుమార్, డాక్టర్ సుధీర్ ద్వారాక్ నాయుడు, డా. నిఖిల్ లక్ష్మణ్, పీజీ విద్యార్థులు విశాల్, వైభవ్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ కమలుద్దిన్, డైటీషియన్ డా. పులి స్ఫూర్తి, జూనియర్ వైద్య బృందం సభ్యులు డా. నవ్య, డా. సారా ఫాతిమా, డా. ఆదిత్యలకు కృతజ్ఞతలు తెలిపారు.