30 March, 2026 | 2:46 AM

యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లు

30-03-2026 01:07 AM
  1. రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా
  2. గృహిణులకు రూ. 8 వేల కూపన్ 
  3. టీవీ, గ్రైండర్, ఫ్రిజ్, మిక్సీ, వాషింగ్ మెషిన్ 
  4. డీఎంకే మ్యానిఫెస్టో విడుదల 
  5. తమిళనాడు సీఎం స్టాలిన్ వరాలు

చెన్నై, మార్చి 29: తమిళనాడు ఎన్నికల్లో గృహిణులు, విద్యార్థులు, రైతులను ఆకట్టుకునేలా సీఎం ఎంకే స్టాలిన్ హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉచితంగా ల్యాప్ టాప్‌లు పంపిణీ చేస్తామని, గృహిణుల కోసం రూ. 8 వేల కూపన్ ఇస్తామని తెలిపారు. ఈ సారి తాము సూపర్‌స్టార్ మ్యానిఫెస్టోతో వస్తున్నామని, డీఎంకేను గెలిపించాలని ఓటర్లను కోరారు.

మహిళలకు పెరిగిన నగదు సహాయం, అధిక పెన్షన్లు, విస్తరించిన ఉచిత విద్యుత్, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లతో సహా అనేక సంక్షేమ, అభివృద్ధి చర్యలను సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదలచేశారు. రాష్ట్రం తన ప్రస్తు త అభివృద్ధి పథంలోనే కొనసాగాలని స్పష్టం చేస్తూ, తాము మళ్లీ అధికారంలోకి వస్తే సమగ్ర సంక్షేమం, ఆర్థిక వృద్ధికి తీసుకునే చర్యల గురించి మేనిఫెస్టోలో వివరించారు.

చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయం లో స్టాలిన్ మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చిందని, తిరిగి ఎన్నికైతే ప్రస్తుత పథకాలను మరింత సమగ్రంగా అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమైన ప్రకటనల్లో భాగంగా, కుటుంబానికి పెద్దదిక్కుగా వ్యవహరించే మహిళల కు ఇచ్చే నెలవారీ సహాయాన్ని రూ.1,000 నుంచి రూ. 2,000కి పెంచనున్నారు. దీనివల్ల 1.37 కోట్లకు పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొం దుతారు.

వృద్ధాప్య పెన్షన్ను కూడా రూ.2 వేలకి పెంచనున్నారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు వర్తిస్తున్న ప్రభుత్వ అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు లభిస్తాయి. అలాగే ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద లభించే ప్రయోజనాలను రూ.1 లక్షకు పెంచనున్నారు. ఆరోగ్యం, గృహనిర్మాణ రంగాలకు ఊతం ఇచ్చేలా సీఎం ఆరోగ్య బీమా పథకం కింద వార్షిక ఆదాయ అర్హత పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని, అలాగే రూ.10 లక్షల బీమా చేస్తామని తెలిపారు.

రాబోయే ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్లను నిర్మిస్తామని కూడా పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ సదుపాయాలను రెట్టింపు చేయనున్నారు. 20 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ మద్దతును కొనసాగిస్తామని, అలాగే మీటర్లు లేని పంప్ సెట్లను అందిస్తామని తెలిపింది. విద్యారంగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 35 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, 120 బిలియ న్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని లక్ష్యంగా చేసుకుని, రూ.18 లక్షలకోట్ల విలువైన పెట్టుబ డులను ఆకర్షించడమే తమ పార్టీ లక్ష్యమని స్టాలిన్ తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు నియో టైడల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి, రాష్ట్ర వృద్ధిని దెబ్బతీ యడానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధితో పాటు, ఈ పత్రం ముసాయిదాను రూపొందించిన సీనియర్ సభ్యులతో సహా పార్టీ నాయకులకు స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. డీఎంకే నాయకత్వంలో పరిపాలన, అభివృద్ధి నిరంతరా యంగా కొనసాగాలని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇల్లత్తరసి పథకం కింద ఆదాయపు పన్ను చెల్లించ ని గృహిణులందరికీ రూ.8,000 విలువైన కూపన్‌ను అందస్తామని తెలిపారు. ఈ కూపన్ చూపిం చి వాషింగ్ మిషీన్, టీవీ, గ్రైండర్, ఫ్రిజ్, మిక్సీ, మైక్రోవేవ్ ఓవెన్ లేదా ఇండక్షన్ స్టవ్ వంటి గృహోపకరణాలను కోనుకోవడం గానీ, మార్చుకోవడం గానీ చేయవచ్చు.