29 June, 2026 | 4:13 PM

నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం

29-06-2026 03:42 PM

హైదరాబాద్: కొత్త ఉద్యోగ ప్రకటన జారీ చేయాలనే తమ డిమాండ్లతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Notification) వద్ద నిరసన చేస్తున్న నిరుద్యోగ యువకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉప నాయకుడు తన్నీరు హరీష్ రావు(Harish Rao) సోమవారం ఖండించారు. ఈ కఠిన చర్య ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఆరోపించారు.

మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను అణచివేస్తూ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నాడని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నిరుద్యోగులను తక్షణమే విడుదల చేయాలని, తెలంగాణ డీజీపీ ప్రకటించిన విధంగా 20,000 పోలీసు ఖాళీల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని బీఆర్ఎస్ నేత  డిమాండ్ చేశారు.