29 June, 2026 | 5:06 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఆర్థిక సాయం

29-06-2026 04:33 PM

మానవత్వం చాటిన కాంగ్రెస్నాయకులు.. ప్రమాద బాధితుడి కుటుంబానికి రూ.25 వేల అందజేత

కోదాడ,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న గర్రెపల్లి విశ్వేశ్వరరావు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవత్వాన్ని చాటుతూ రూ.25 వేల ఆర్థిక సాయాన్ని సోమవారం బాధితుడుకి అందజేశారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు 32వ వార్డు కౌన్సిలర్ పాశం శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన విశ్వేశ్వరరావు స్థానికంగా ఓ ఆయిల్ డిపోలో గుమస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వెంటనే స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ నాయకులను ఆదేశించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని విశ్వేశ్వరరావుకు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 32వ వార్డు ఇంచార్జి చీదెళ్ల హనుమంతరావు, కోట హరీష్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు భాష బోయిన భాస్కరరావు, తెలంగాణ ఉద్యమకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాయపూడి వెంకటనారాయణ, వేమూరి లక్ష్మీనారాయణ, కొత్తూరు శ్రీనివాస్, ఎలమంచిలి రమణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.