29 June, 2026 | 4:35 PM

నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

29-06-2026 03:27 PM

ముకరంపుర, జూన్ 29(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 35వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, బొమ్మకల్ రోడ్డులో తెలంగాణ వారాల సంఘ భవన అభివృద్ధి పనులకు  పార్లమెంట్ సభ్యుల నిధుల  నుండి మంజూరైన 5 లక్షల రూపాయలతో ఈ భవన అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.అలాగే వెంకట సాయి టాకీస్ వెనుక రోడ్డులో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ. 52 లక్షల మునిసిపల్ సాధారణ నిధులతో మంజూరైన పైప్  డ్రైన్ ,సిసి రోడ్డు నిర్మాణ పనులకు, 46వ డివిజన్లో కూడా  మునిసిపల్ సాధారణ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు , సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ,35వ డివిజన్ కార్పొరేటర్ సాదవేని సుజాత- శ్రీనివాస్ ,46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్,36వ డివిజన్ కార్పొరేటర్ తోట అనిల్ , మున్సిపల్ అధికారులు, తెలంగాణ వారాల సంఘం పెద్దలు,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.