15 April, 2026 | 9:55 AM

కేసీఆర్‌పై కక్షసాధింపులు మానుకోవాలి

03-02-2026 12:12 AM
  1. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ 
  2. సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్షసాధింపులు మనుకోవాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ముఖ్యమంత్రికి సోమవారం బహిరంగ లేఖ రాశారు. అధికార అహంకారంతో కేసీఆర్‌పై తప్పుడు కేసులు పెట్టడం, రాజకీయంగా అ ణిచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వా మ్య విలువలకు విరుద్ధమని విమర్శించా రు.

ఇది ఒక వ్యక్తిపై చేసే దాడి కాదని, తెలంగాణ ఆత్మగౌరవంపై చేసే దాడిగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని, ప్రజలు ఇచ్చిన తాత్కాలిక బాధ్యత మాత్రమేనని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్‌పై విమర్శల కంటే రాష్ట్ర పరిపాలనపై దృష్టి పెట్టాలని, అవినీతి నిర్మూలనతో పా టు పారదర్శక పాలన అందించాలన్నారు.