రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కోచింగ్ ప్రారంభం

06-10-2026 | 04:54pm

కొల్లాపూర్ అక్టోబర్ 6: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) విడుదల చేసిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో(SI and Constable Notification) భాగంగా కొల్లాపూర్ పట్టణంలో  రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శౌర్య పోలీస్ అకాడమీ హైదరాబాద్ వారి సహాకారంతో ఉచిత శిక్షణను ఈ నెల 8 వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ ఒక ప్రకటనలో తెలిపారు. 

8వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు, ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు