8 April, 2026 | 4:12 AM

మహిళలకు ఉచితంగా చిత్ర ప్రదర్శన

08-04-2026 01:37 AM

ఈ చిత్రం పూర్తి కుటుంబ వినోదంతోపాటు హృద్యమైన భావోద్వేగాలతో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది ‘డైమండ్ డెకాయిట్’. ఏప్రిల్ 10న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో థియేటర్ల ద్వారా విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ట్రైలర్‌ను వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటిం చింది.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానున్న థియేటర్లలో 4 షోలు మహిళలకు ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో పార్ధా గోపాల్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించగా, మేఘనా రెడ్డి హీరోయిన్‌గా నటించారు. రచయిత, దర్శకుడు సూర్య జీ యాదవ్ దర్శక త్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: పీఆర్; సినిమాటోగ్రఫీ: శివ అచంట; ఎడిటర్: శివ సర్వాణి.