8 April, 2026 | 4:12 AM

అహోం ఆరంభం

08-04-2026 01:38 AM

వివేక్ మిశ్రా, శ్రుతిక జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహోం’. ఈ చిత్రాన్ని ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్‌పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియాగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమా నికి నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వీవీ వినాయక్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ మోడల్ దీప్తి, నటులు ఆజాద్, విశ్వ, కోటకొండ కృష్ణ, శాండీ, హైదరాబాద్ యూత్ ఐకాన్ వినయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కేఎన్ రామారావు మాట్లా డుతూ.. “ఈరోజుల్లో సినిమాలను ఒక్క భాషలో చేస్తే వర్కవుట్ కావటం లేదు.

బెంగాళీ, మరాఠీల్లోనూ అనువాదించాలనుకుం టున్నాం” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ పునీత్; డీవోపీ: వెంకట్ ఆనెం; పాటలు: శ్రీరామ్ తపస్వి; ఫైట్స్: జయరాం; ఎడిటర్: శివ శర్వాణి; నిర్మాత: దశరథ్; స్క్రిప్ట్, డైరెక్షన్: ప్రసాద్ రాజు.