24 July, 2026 | 10:34 PM

చర్లలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

24-07-2026 09:51 PM

పోలీసులకు సన్మానం

చర్ల,(విజయక్రాంతి): మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ భద్రాచలం  వి. శివనాయక్ ఆధ్వర్యంలో, బార్ అసోసియేషన్ భద్రాచలం సౌజన్యంతో చర్లలో శనివారం ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతోపాటు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి పతకాలు సాధించిన పోలీసు అధికారులకు సన్మానించనున్నారు. శనివారం  ఉదయం 9 గంటలకు చర్ల రైతు వేదికలో  జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ భద్రాచలం  వి. శివనాయక్ హాజరుకానున్నారు.

సన్మానించే పోలీసు అధికారులు:

1. చర్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్  రాజు వర్మ

2. చర్ల సబ్ ఇన్‌స్పెక్టర్ నర్సి రెడ్డి

3. చర్ల సబ్ ఇన్‌స్పెక్టర్  కేశవ్

4. చర్ల హెడ్ కానిస్టేబుల్ రాంబాబు

5. చర్ల కానిస్టేబుల్ రాము

ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని  చర్ల మండల యూత్ కోరుతున్నారు.