5 June, 2026 | 1:12 AM

భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి

05-06-2026 12:00 AM

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

ముషీరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాజకీయ విశ్లేషకుడు కె.నాగేశ్వర్‌పై నమోదైన కేసులను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రొ.నాగేశ్వర్ పై జరుగుతున్న కక్షపూరిత దాడులు, సోషల్ మీడియా ట్రోలింగ్, కేసులను ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సుప్రీంకోర్టు మాజీ  న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం.కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య  పద్మ, సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్, సీపీఎం నేత ఎస్.వీరయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునా ది అన్నారు. కూనంనేని మాట్లాడుతూ నాగేశ్వర్ గొంతును కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు.

కోదండరామ్ మాట్లాడుతూ అభిప్రాయ భేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ తనపై నమోదైన కేసులకు భయపడబోనని, ప్రజా సమస్యలపై తన రచనలు, విశ్లేషణలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించాలని, నాగేశ్వ్ప నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, ఈటి. నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్.బోస్, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి. స్టాలిన్ తదితరులు పొల్గొన్నారు.