క్రీడలతో స్నేహభావం పెంపొందించుకోవాలి
సర్పంచ్ జంపుక మాధవి ఆనంద్
బోయినపల్లి: జనవరి 14 (విజయక్రాంతి): క్రీడలతో స్నేహభావం పెంపొందించుకోవాలని సర్పంచ్ జంపకం మాధవి ఆనంద్ చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జూనియర్ మరియు సీనియర్ క్రికెట్ పోటీలను గ్రామ యువకులు సీనియర్ క్రికెట్ ప్లేయర్ బుర్ర శివ, గాదర్ల బాలు,(కేసిసి) ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ మరియు సీనియర్ 9 జట్లు తలపడగా సీనియర్ జూనియర్ జట్లలో గెలుపొందిన టీమ్లకు ప్రథమ దిశ తృతీయ బహుమతులు నగదు అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జంపకమాధవి మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్రగడ్డం స్వామి రెడ్డి, నాయకులు మరియు దాతలు, తదితరులు పాల్గొన్నారు.




