20 May, 2026 | 2:15 AM

ప్రజా సమస్యల పరిష్కారంలో విజయక్రాంతి ముందడుగు

15-01-2026 01:28 AM

వెంపటి సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య

తుంగతుర్తి, జనవరి 14: ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు, ప్రజలకు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటూ విజయ క్రాంతి దినపత్రిక ముందడుగు సాధించిందని వెంపటి సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య అన్నారు.

బుధవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి ,మాట్లాడారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వస్తుందని అన్నారు. దినపత్రిక రిపోర్టర్లకు, యాజమాన్యానికి ,పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరి ఓరుగంటి శ్రీనివాస్, యువత పాల్గొన్నారు.