calender_icon.png 5 February, 2026 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇకపై ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు!

05-02-2026 01:07:54 AM

  1. కొత్త విద్యుత్ కనెక్షన్లకు ఇష్టారీతిన ఛార్జీల వసూలుకు చెక్
  2. విద్యుత్తు నియంత్రణ మండలి నిర్ణయం.. గెజిట్ విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఇకపై కొత్త విద్యుత్తు కనెక్షన్ కావాలంటే.. ఇప్పటి వరకు ఉన్నట్టుగా.. దూరాన్ని బట్టి ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేయడం ఉండదు. ఇకపై కొత్తగా దరకాస్తు చేసుకునే వినియోగదారుడు వినియోగించే విద్యుత్తు సామర్థ్యం ఆధారంగా ఫిక్స్‌డ్ ఛార్జీలు మాత్ర మే వసూలు చేయాలని, ఎంత దూరం ఉన్నా వినియోగదారునికి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత డిస్కంలపైనే ఉంటుందని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) స్పష్టం చేసింది.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గెజట్ రూపంలో ప్రభుత్వం ప్రచురిం చింది. దీని ప్రకారం గృహ విద్యుత్తు కనెక్షన్‌కు (ఎల్టీ కేటగిరీ-1) ఒక కిలోవాట్‌కు రూ.500 చొప్పున వసూలు చేయనున్నారు. ఒక కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ వరకు రూ. 500 లతోపాటు కిలోవాట్‌కు రూ. 600 చొప్పున వసూలు చేయనున్నారు. 

కొత్త కనెక్షన్‌కు ఫిక్స్‌డ్ ఛార్జీలు ఇలా..

ఎల్టీ-1 : డొమెస్టిక్

ఒక కిలోవాట్ వరకు - రూ. 500. ఒక కిలోవాట్ పైబడి 5 కిలోవాట్ల వరకు  - రూ. 500తోపాటు అదనంగా ఒక్కో కిలోవాట్‌కు రూ. 600 చొప్పున. 5 కిలోవాట్ల పైబడి 20 కిలోవాట్ల వరకు - రూ. 2900లతోపాటు అదనంగా ఒక్కో కిలోవాట్‌కు రూ. 1500 చొప్పున. 20 కిలోవాట్లకు పైగా - ఒక్కో కిలోవాట్‌కు రూ. 10వేల చొప్పున.  

ఎల్టీ-2 : నాన్‌డొమెస్టిక్/కమర్షియల్

ఒక కిలోవాట్ వరకు - రూ. 1000. ఒక కిలోవాట్ పైబడి 5 కిలోవాట్ల వరకు - రూ. 1000 తోపాటు కిలోవాట్‌కు రూ. 1200 చొప్పున. 5 కిలోవాట్ల పైబడి 20 కిలోవాట్ల వరకు - రూ. 5,800తోపాటు కిలోవాట్‌కు రూ. 2000 చొప్పున. 20 కిలోవాట్లకుపైబడి - కిలోవాట్‌కు రూ. 10 వేల చొప్పున. 

ఎల్టీ-3: ఇండస్ట్రీస్

20 కిలోవాట్ల వరకు - కిలోవాట్‌కు రూ. 4000 చొప్పున. 20 కిలోవాట్లకుపైబడి - కిలోవాట్‌కు రూ. 10 వేల చొప్పున. 

ఎలీ-4: కాటేజ్ ఇండస్ట్రీస్ పరిమితి ఉన్నం త వరకు-కిలోవాట్‌కు రూ.1000 చొప్పున. 

ఎల్టీ-5: అగ్రికల్చర్

పరిమితి ఉన్నంత వరకు-కిలోవాట్‌కు రూ.1000 చొప్పున. ఎల్టీ-9..ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఒక కిలోవాట్ వరకు-రూ. 1000. ఒక కిలోవాట్‌పైబడి 20 కిలోవాట్ల వరకు - రూ. 1000తోపాటు కిలోవాట్‌కు రూ.1200 చొప్పున. 20కిలోవాట్లకుపైబడి-కిలోవాట్‌కు రూ. 8000 చొప్పున. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

ఇకపై విద్యుత్ కనెక్షన్ల కోసం విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఇకపై ఆయా డిస్కంల వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌లోనే విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వాలనే దానిపై నిర్దిష్ట సమయాన్ని పేర్కొం ది. దీని ప్రకారం.. గ్రామాల్లో కొత్త విద్యుత్తు కనెక్షన్ దరకాస్తు చేసుకున్న 15 రోజుల్లో కనెక్షన్ ఇవ్వాలి.

కొండప్రాంతాలు, లోయలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో 30 రోజుల వరకు సమయం ఉంటుంది. ప్రత్యేకంగా స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వంటివి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితే ఉంటే.. 90రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వా ల్సి ఉంటుంది. ఇక మున్సిపాలిటీల్లో 7 రోజు ల లోపల, అలాగే మెట్రోనగరాల్లో 3 రోజుల్లో కొత్త విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.