12 April, 2026 | 1:05 AM

స్తంభించిన ఎక్స్

29-08-2024 12:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ బుధవారం ఉదయం కొద్దిసేపు స్తంభించింది. ఉదయం 9 గంటల సమయంలో ఎక్స్ యాప్ పనిచేయాలని యూజర్లు గగ్గోలు పెట్టారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు ఈ సమస్య కొనసాగిందని డౌన్‌డిటెక్టర్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ప్రకటించింది. దాదాపు వెయ్యి మంది యూజర్లు తమ ఎక్స్ యాప్ పనిచేయటం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఈ సమస్యకు కారణాన్ని కంపెనీ తెలుపనప్పటికీ త్వరగానే సమస్యను పరిష్కరించినట్టు ప్రకటించింది.