12 April, 2026 | 2:53 AM

జపాన్‌లో బియ్యం కొరత

29-08-2024 12:00 AM

టోక్యో, ఆగస్టు 28: ఎప్పుడూ నిండు కుండలా ప్రశాంతంగా ఉండే జపాన్‌లో ఇప్పుడు బియ్యం కొరత ప్రజలను భయపెడుతున్నది. అతి త్వరలో భారీ భూకంపంతోపాటు తీవ్రమైన టైఫూన్లు (తుఫాన్లు) రావచ్చన్న వదంతులతో జపాన్ వాసులంతా ముందస్తుగా సరుకులు కొనుగోలు చేసేందుకు మంగళవారం దుకాణాల కు పరుగులు పెట్టారు. దీంతో గంటల వ్యవధిలోనే చిన్న దుకాణాలతోపాటు సూపర్ మార్కెట్లలోనూ గ్రాసరీ సరుకులన్నీ నిండుకొన్నాయి.

ముఖ్యంగా బియ్యానికి తీవ్ర కొరత ఏర్పడింది. టక్యోలో ప్రసిద్ధి చెందిన సూపర్‌మార్కెట్ చైన్ ఫ్రెస్కోలో కూడా బియ్యం దొరకటం లేదు. ‘మామూలు సమయంతో పోల్చితే ఈ వేసవిలో మేం తీసుకొ చ్చిందే సగం బియ్యం. అవి కూడా వెంటనే అయిపోయాయి’ అని ఫ్రెస్కో ఉద్యోగి ఒకరు తెలిపారు. కొరత నేపథ్యంలో దుకాణాల ముందు ఒక కుటుంబానికి రోజుకు ఒకటే బియ్యం బ్యాగు అని బోర్డులు పెట్టారు.