73 వేల అసాల్ట్ రైఫిల్స్‌కు ఆర్డర్
29-08-2024 12:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 28: సైన్యం కోసం భారత రక్షణ శాఖ మరో 73 వేల ఎస్‌ఐజీ సాయెర్ అసాల్ట్ రైఫిల్స్ కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం చేసుకొన్నది. 2019లోనూ ఇదే రకానికి చెందిన 72,400 రైఫిల్స్‌ను కొనుగోలు చేసింది. 7.65x51 మిల్లీమీటర్ల కాలిబర్‌తో ఉండే ఈ తుపాకులు 500 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా చేధించగలవు. సరిహద్దులో పెట్రోలింగ్ నిర్వహించే సైనికులకు వీటిని అందిస్తారు. తాజా కాంట్రాక్టు విలువ రూ.837 కోట్లు. నిజానికి మన దేశంలోనే రష్యాకు చెందిన ఏకే 203 కలష్నికోవ్ తుపాకులను తయారు చేస్తున్నారు. అయితే, వీటి తయారీ ఆలస్యం అవుతుండటంతో అత్యవసరంగా రక్షణ శాఖ అమెరికాకు ఈ కాంట్రాక్టు ఇచ్చింది.




