calender_icon.png 4 June, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫలించని చర్చలు

03-06-2025 12:01:50 AM

- ఇస్తాంబుల్ వేదికగా అసంపూర్తిగా ముగిసిన శాంతి చర్చలు

- యుద్ధ ఖైదీల మార్పిడి మినహా కాల్పుల విరమణకు రష్యా ససేమీరా

- చర్చలకు ఒకరోజు ముందే ఉక్రెయిన్ మెరుపు దాడులు

- ‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’తో రష్యాకు కోలుకోలేని దెబ్బ

- ‘పెరల్ హార్బర్’ లాంటి ఘటన అని అభివర్ణించిన రష్యా

ఇస్తాంబుల్, జూన్ 2: రష్యాపై ఉక్రెయిన్ మెరుపు డ్రోన్ల దాడితో ఇరుదేశాల మధ్య ప రిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం తుర్కియే రాజధాని ఇస్తాంబుల్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిపిన శాంతి చర్చలు ముగిశాయి. కాల్పుల విరమణ ఒప్పందం, యుద్ధ ఖైదీల మార్పిడి ప్రధాన అంశంగా జరిగిన రెండో దఫా చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో ఉక్రెయిన్ తరఫున రక్షణ మంత్రి రుస్తెం ఉమరోవ్, రష్యా తరఫున ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ వ్లా దిమిర్ మెదిన్‌స్కీ హాజరయ్యారు. చర్చల్లో  తీవ్రంగా గాయపడిన 25 ఏళ్లలోపు యుద్ధ ఖైదీల మార్పిడికి మాత్రమే ఇరుదేశాలు అ ంగీకారం తెలిపాయి. అయితే సంపూర్ణ కా ల్పుల విరమణ ఒప్పందంపై మాత్రం వెనక్కి తగ్గేది లేదని రష్యా స్పష్టం చేసింది. యు ద్ధంలో మరణించిన సైనికుల శవాల రికవరీ చేసేందుకు రెండు నుంచి మూడు రోజుల కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి న ట్టు వ్లాదిమిర్ మెదిన్‌స్కీ తె లిపారు.

మ రోవైపు ఇరు దేశాల మధ్య దాడుల వల్ల చ నిపోయిన 6వేల మంది సైని కులను అ ప్పగించేందుకు కీవ్‌౬ మ ధ్య ఒ ప్పందం కుదిరిందని ఉక్రెయిన్ రక్షణ మ ంత్రి రుస్తెం ఉమరోవ్ తెలిపారు. చర్చల్లో పురోగతి తీసుకురావడం కోసం జూన్ చివరి నాటికి మూడో దఫా చర్చలు జరపాలని ఉ క్రెయిన్ ప్రతిపాదించింది. ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం స్నేహపూర్వక వాతావర ణ ంలో జరిగాయని తుర్కియే విదేశాంగ మ ంత్రి హకన్ ఫిడాన్  తెలిపారు. 

మునుపెన్నడూ చూడని విధ్వంసం

రష్యా యుద్ధంలో మునుపె న్నడూ చూడని విధ్వంసం ఆదివారం చోటు చేసుకుంది. మూడేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తొలిసారి రష్యాకు చె ందిన నాలుగు వైమానిక స్థావరాలను ల క్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున డ్రోన్లతో వి రుచుకుపడడం గమనార్హం. రష్యా భూ భాగంలోకి వందల కిలోమీటర్ల మేర చొ చ్చుకెళ్లి ఉక్రెయిన్ దాడి చేయడం ఇదే తొ లిసారి. ఈ దాడుల్లో రష్యాకు చెందిన టీ యూ టీయూ ఎం బాంబర్లు, ఏ50 ఎయిర్ క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది.

కాగా రష్యాపై డ్రోన్ల దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వయంగా పర్యవేక్షించారని ఉక్రెయిన్ సైనిక  అధికారు లు తెలిపారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ దాడులకు ప్రణాళిక జరిపినట్టు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ దాడిని నిరసిస్తూ  ఆ దేశంలో వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లి రష్యా దాడి చేసింది. 472 డ్రోన్లను ప్రయోగించింది.. సైనిక శిక్షణ కేం ద్రంపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది ఉ క్రెయిన్ సైనికులు మృతి చెందగా.. 60 మ ందికి పైగా గాయపడ్డారు.

‘పెరల్ హార్బర్ ఘటన’గా అభివర్ణన

ఉక్రెయిన్ జరిపిన మెరుపు దాడులను  ‘పెరల్ హార్బర్’ ఘటనతో పోలుస్తూ రష్యన్ మీడియా అభివర్ణించింది. దీనికి అంతకం త కూ బదులు తీర్చుకుంటామని  పరోక్ష ం గా హెచ్చరికలు కూడా జారీ చేసింది. పశ్చి మ దేశాల పత్రికలు కూడా రష్యాపై ఉక్రె యిన్ చేసిన దాడిని ‘రష్యా పెరల్ హార్బర్’గా అభి వర్ణించడం గమనార్హం. రెండో ప్రపంచ యు ద్ధం సందర్భంగా 1941 డిసెంబర్ 7న అ మెరికా నేవల్ బేస్ అయని హవాయిలోని పెరల్ హార్బర్‌పై జపాన్ విరుచుకుపడిన స ంగతి తెలిసిందే. 

ఏమీటీ ఆపరేషన్ స్పైడర్ వెబ్?

‘ఆపరేషన్ స్పైడర్ వెబ్’ పేరుతో ఉక్రె యిన్ రష్యాపై 117 డ్రోన్లతో విరుచుకుపడి 41 యుద్ధ విమానాలు ధ్వంసం చేసింది. అయితే ఈ ఆపరేషన్ కోసం ఉక్రెయిన్ 117 ఫస్ట్ పర్సన్ వ్యూ ఆత్మాహుతి డ్రోన్లను తొలుత రష్యాలోకి స్మగ్లింగ్ చేసింది. వీటిని కొద్ది దూరం నుంచే పైలట్లు ఆపరేట్ చేయవచ్చు. చెక్కతో చేసిన క్యాబిన్లలో పెట్టి ట్రక్కులపై ఉంచి స్థానిక డ్రైవర్లను నియమిం చుకొని వైమానిక స్థావరాల వద్దకు చేర్చింది.

ఆదివారం మధ్యాహ్నం నాటికి ఈ లారీల లోని చెక్క క్యాబిన్ల డోర్లను రిమోట్ సాయం తో తెరిచింది. ఆ తర్వాత ఆత్మాహుతి డ్రోన్లు ఒక్కోటీ గాల్లోకి ఎగిరి రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ బాంబర్లపై విరుచుకుపడ్డాయి. ఇందుకోసం రష్యా భూభాగంలోని మూడు టైమ్ జోన్లలో ఉక్రెయిన్ గూఢచారులు పనిచేశారు. అయితే ఈ ఆపరేషన్‌కు సహకరించిన వారిని ముందే ఆ భూభాగం నుంచి సురక్షితంగా బయటకు తెచ్చేసినట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.

మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా?

అయితే ఉక్రెయిన్ దాడికి ప్రతీకారం గా రష్యా అణుదాడికి సిద్ధమవుతు న్నట్టు తెలు స్తోంది. ఇందుకోసం రష్యా అణు పరీక్షలు కూడా నిర్వహిస్తోందని సమాచారం. ఇప్పటి కే ఉక్రెయిన్ రష్యాలో అణు సామర్థ్యం కలిగిన 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌పై ప్రతీకారంతో రష్యా అణు, హైడ్రోజన్ బాంబు దాడికి సిద్ధ మవుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచం లోనే అత్యధిక అణు ఆయుధాలు ఉన్న దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

రష్యాలో దాదాపు 5600 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అణు ఆ యుధాల నిల్వలో 47 శాతం అని ఫెడ రేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ డేటా చెబుతోంది. రష్యా చర్యలతో ప్రపంచ దేశాలు కూడా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. ఉక్రెయిన్‌పై అణు బాంబులు ప్రయోగిస్తే ప్రపంచంపై భారీగా రేడియేషన్ ప్రభావం ఉండ నుంది. చివరికి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశముంది.