21 March, 2026 | 10:36 AM

షాకిచ్చిన ఇంధన కంపెనీలు

21-03-2026 12:00 AM
  1. ప్రీమియం పెట్రోల్ రూ.2, ఇండస్ట్రియల్ డీజిల్.. రూ.22 పెంపు
  2. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం

న్యూఢిల్లీ, మార్చి 20: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటిన నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధర ను రూ.2 పెంచాయి. అదనంగా ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు రూ.22 పెంచారు. ధర పెరిగిన తర్వాత రూ.87.57 నుంచి రూ.109.59కి చేరింది. ఈ పెరిగిన ధరలు మార్చి 20వ తేదీ రాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

అయితే, ప్రస్తుతానికి రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధ పరిస్థితుల రీత్యా ఇప్పటికే ఎల్పీజీ సంక్షోభాన్ని సృష్టిస్తుండగా, చమురు కంపెనీలు ప్రీమి యం పెట్రోల్ ధరను పెంచి మరో దెబ్బతీశాయి. కొన్ని ఐఓసీఎల్ అవుట్‌లెట్లలో ఎక్స్పి 95 పెట్రోల్ ప్రస్తుతం లీటరుకు రూ.101. 80 చొప్పున అమ్ముడవుతోంది. గతంలో కొన్ని ప్రాంతాలలో లీటరుకు రూ.111. 68గా ఉన్న ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పు డు లీటరుకు రూ.113.77కు పెరిగింది.

ఈ పెరుగు దల కారణంగా ఉత్తర ప్రదేశ్ రాజధాని ల క్నోలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 103.92 కు చేరగా, పుణెలో ప్రీమియం పెట్రోల్ లీటరుకు రూ.113.17కు అమ్ముడవు తోంది. పా రిశ్రామిక డీజిల్‌ను సాధారణ పెట్రోల్ పం పులలో అమ్మరు. దీనిని ఫ్యాక్టరీలు, పెద్ద జనరేటర్లు, మైనింగ్ కంపెనీలు, నిర్మాణ స్థలా లు, పవర్ ప్లాంట్లు నేరుగా కొ నుగోలు చేస్తా యి. గతంలో చమురు కంపెనీలు బ్రాండెడ్, హై-ఆక్టేన్ ప్రీమియం పెట్రో ల్ ధరలను లీటరుకు సుమారు రూ.2 మేర పెంచాయి. అయితే, సాధారణ పెట్రోల్ ధర లో ఎలాం టి మార్పు లేకపోవడంతో వినియోగదారులకు తక్షణ ఉపశమనం లభించింది.