76 రోజులకు ఇంధన నిల్వలు
- హోర్ముజ్ మరో నెల మూసి ఉన్నా ఢోకా లేదు
- కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి
న్యూడిల్లీ, జూన్8: దేశంలో 76 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయ ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మం త్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. దేశానికి తక్షణ ఇంధన ముప్పు ఏదీ లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి మూతపడినా భారత్‌కు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఆటంకాలు ఎదురైనా తట్టుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని, త్వరలోనే ఇంధన ధరలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటి సంక్షోభంలోనూ దేశంలో ఎక్కడా ఇంధన కొరత రాలేదని, పైగా భారత్ ఎగుమతులు కూడా చేస్తోందన్నారు. చమురు ధరలు ఎక్కువ కాలం ఇలాగే ఉండవని మంత్రి భావిస్తున్నారు.
హోర్ముజ్ జలసంధి మరో నెల రోజులు మూతపడి, చమురు రవాణాకు ఆటంకం ఏర్పడినా 60 రోజుల వరకు భారత్‌కు ఇబ్బంది ఉండదన్నారు. వ్యూహాత్మక చము రు నిల్వలు, రిఫైనరీ ఇన్వెంటరీలు, కమర్షియల్ స్టాక్స్ అందుబాటులో ఉన్నాయని, ఇవి 30 నుంచి 60 రోజుల బఫర్ నిల్వలను అందిస్తాయని తెలిపారు. గల్ఫ్ ప్రాంతం వెలుపల నుంచి దిగుమతులను చేస్తున్నా మని తెలిపారు.






