calender_icon.png 17 February, 2026 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు కోల్పోతున్న తమకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి

17-02-2026 01:21:25 PM

నేషనల్ హైవే  రోడ్డు పనులను  అడ్డగింతలో లక్కారం రైతులు

ముత్తారం,(విజయక్రాంతి): నేషనల్ హైవే రోడ్డులో(National Highway road works) భూములు కోల్పోతున్న తమకు పూర్తిస్థాయి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని  నిర్వాసిత రైతులు మంగళవారం రోడ్డుపనులను అడ్డగించారు. ముత్తారం మండలంలోని లక్కారం గ్రామంలో తమ వ్యవసాయ భూముల కు,  బావులకు నష్టపరిహారం డబ్బులు మొత్తం వెంటనే చెల్లించేంత వరకు  పనులు  జరగనివ్వబోమని రైతులు టెంట్ వేసుకొని   బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సార్ వచ్చి తమకు న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుండి  వెళ్ళాబోమంటూ  రైతులు భీష్ముంచుకొని కూర్చున్నారు.