21 June, 2026 | 6:08 PM

ఇల్లందు ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వాహణ

21-06-2026 05:00 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సింగరేణి జీఎం కార్యాలయం, గనులు, డిపార్ట్మెంట్లో ఆదివారం యోగ కార్యక్రమాలు నిర్వహించారు. జి. యం. కార్యాలయంలో నిర్వహించినటువంటి యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలో అడుగుపెడుతు యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.

ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత జీవితాల్లో ఆరోగ్యాన్ని ఆనందాన్ని నింపుకుంటున్నాయని జూన్ 21 యోగా దినోత్సవం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు చేస్తే యోగాసనాలు వేయడంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది. ఏరియా జనరల్ మేనేజర్ వి కృష్ణయ్య అన్నారు. ఆరోగ్యకరమైన వృద్దాప్యం కోసం యోగా ఈ సంవత్సరం థీమ్ తో యోగాతో పాటు ఆహార అలవాట్లు కూడా సంపూర్ణ ఆరోగ్యానికి దోహద పడుతుందని అన్నారు.

యోగ అనేది నిత్యజీవితంలో భాగమైపోవాలి మనిషి ఉన్న 24 గంటల సమయంలో శరీరం కోసం మనసు ఉల్లాసం కోసం కొంత సమయం కేటాయించాలి నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి జీవితం యాంత్రికమే కాబట్టి మనసు ప్రశాంతత లేకపోతే ఎంతటి గొప్ప వ్యక్తి అయినా ఎంతటి వ్యాపారి అయినా తన ఉన్న రంగంలో రాణించడం అంత సులువు కాదు కాబట్టి మనిషి తన ప్రయాణం ఎటువైపు వెళుతున్నప్పటికీ ఎంత సంపాదిస్తున్నప్పటికీ ఏది సాధిస్తున్నప్పటికీ యోగ తప్పనిసరిగా చేసుకుంటే మంచిది యోగ ప్రతి ఒక్కరూ నిబద్ధతతో అలవాటు చేసుకోవాలి.

మనిషి శారీరక మానసిక ఆధ్యాత్మిక కోణాలన్నింటినీ సంయోగపరచి స్థిరమైన సంతృప్తికరమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని సాధించడానికి దోహదం చేసేది యోగ అని చాలామందికి యోగా అంటే యోగాసనాలు అనే తెలుసు కానీ యోగ అనేది ఋగ్వేద కాలం నుంచి ప్రస్తావనలో ఉందని ప్రస్తుత కాలంలో యోగ సాధన వల్ల మానసిక శరీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు అనే విషయం గ్రహించి చాలామంది ఆచరిస్తున్నారు మరియు అభ్యసిస్తున్నారు.

యోగ ద్వారా ఏకాగ్రత సాధించి పరతత్వ సానిద్యాన్ని పొంది, తను అంతరంగంలోనే సాధకుడు సమస్త విశ్వాసాన్ని దర్శిస్తాడని ఆశ ధర్మం చెబుతుందని యోగ సాధనలో శ్రీయ సామర్థ్యం పెరుగుతుందని శరీర ఆకృతుని మెరుగుపరుస్తుందని బరువు తగ్గడానికి గుండె బలోపేతం కావడానికి ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడుతుందని రోజుకు కనీసం 30 నిమిషాల పాటు యోగ చేస్తే చాలావరకు జబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు అని పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో యస్వోటు జియం రామస్వామి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ సి.ఆర్.బి.ప్రసాద రావు, ఏరియా ఇంజనీర్ లక్ష్మన మూర్తి, డీజియం (ఐ.ఇ.డి) ప్రభాకర్ రావు, డీజియం (సివిల్) రవికుమార్, డి.జి.యం (యఫ్&ఏ) నాగలక్ష్మి, రామమూర్తి, దిలీప్ కుమార్, రాందాస్, శివ వీర కుమార్, ఆర్.యం. వెంకటేశ్వర్లు, బోడ నాగేశ్వర రావు, గుర్తింపు సంఘం నుంచి ముస్తఫా, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నత అధికారులు మరియు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు పాల్గొనారు.