21 June, 2026 | 5:57 PM

రెడ్ క్రాస్ సొసైటీ లో సభ్యులుగా చేరాలి: జిల్లా కలెక్టర్ పిలుపు.

21-06-2026 05:20 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): సామాజిక సేవ దృక్పథం కల్గిన ప్రతి ఒక్కరు రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి నేతృత్వంలో 40 మంది రెడ్ క్రాస్ సొసైటీలో శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతన సభ్యులకు కలెక్టర్  ఐడి కార్డులను, సభ్యత్వ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీలో పెద్దఎత్తున సభ్యులను చేర్పించిన సమితి అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రి ని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.