28 August, 2026 | 8:11 PM

Breaking News

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ : గుండా నిరంజన్   •   సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •  

జాతీయ లోక్ అదాలత్ తో వేల కేసులు పరిష్కారం

21-06-2026 05:17 PM

* జిల్లా ఎస్పీ మహేష్ బి గితే

* పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు

సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 265 కేసులు, 23 పెట్టి కేసులు, 1043 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు, 2419 ట్రాఫిక్ చలాన్ కేసులు, 75 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. అలాగే సైబర్ నేరాల బాధితులకు సంబంధించిన రూ.22.31 లక్షల రిఫండ్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, కోర్టు మానిటరింగ్ అధికారులు, సిబ్బంది, పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. లోక్ అదాలత్ విజయవంతానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.