మాగీ గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీల నిర్వహణ
25-05-2026 06:03 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామంలో ముత్యాల పోచమ్మ,ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుస్తీ పొడిలో ఘనంగా నిర్వహించారు. మల్లయోధులకు వంద రూపాయల నుండి రూ.5000 వరకు నగదు బహుమతులను అందించారు. పిట్లం, కంగ్టి, నారాయణకేడ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చిన మల్లయోధులు ఈ కుస్తీ పోటీ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మెంగారం శ్రీనివాస్, పండరి, బాలసాయిలు తదితరులు పాల్గొన్నారు.






