8 July, 2026 | 9:16 PM

20న ప్రేక్షకుల ముందుకు డాక్యుమెంటరీ

18-12-2024 12:00 AM

ఆస్కార్ అనేది తెలుగు సినిమాకు కలే అని ప్రేక్షకులంతా ఫిక్స్ అయిపోయిన తరుణంలో ఆ అవార్డును తీసుకొచ్చి దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. భారతీయ సినీ పరిశ్రమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందీ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా తెర వెనుక విశేషాలను చెప్పేందుకు తాజాగా చిత్ర యూనిట్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీని రూపొందించింది.

‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో ఈ డాక్యుమెంటరీని తీసుకురానుంది. మంగళవారం దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలా షూట్ చేశారనేది ట్రైలర్‌లో చూపించారు. ‘నాటు నాటు’ పాట సహా ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు, సినిమా గురించి వాళ్లిద్దరితో పాటు పలువురు పంచుకున్న షూటింగ్ విశేషాలతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ విడుదల కోసం కొన్ని థియేటర్లను ఎంపిక చేశారు. వాటిలో ఈ నెల 20న ఈ డాక్యుమెంటరీ విడుదల కానుంది.