7 April, 2026 | 1:56 AM

పరిమితులు దాటుతున్న ఫంక్షన్‌హాళ్లు..

07-04-2026 12:00 AM
  1. జనావాసాల్లో రచ్చ రచ్చ..
  2. గుండెపోటు బాధితులకు దడ.. దడ
  3. మారుమోగిపోతున్న డిజేలు..అర్ధరాత్రిల్లు బ్యాండ్ బాజాలు..డాన్సులు..
  4. డీజే లతో పగుళ్లు తీస్తున్న పాత గోడలు..
  5. నివాసితులకు ఎదురవుతున్న ఇబ్బందులు..
  6. కన్నెత్తి చూడని సంబంధిత శాఖ అధికారులు..

బాన్సువాడ, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో జనావాస ప్రాంతాల్లోనే ఇబ్బడి ముబ్బడిగా ఫంక్షనల్ ఏర్పాటు అవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా ఫంక్షన్ హాల్ అని ఏర్పాటు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు, నూతన వస్త్రా ధారణలు, బర్త్ డేలు, చివరకు రాజకీయ సమావేశాలు, కుల సంఘాల మీటింగ్లు సైతం ఫంక్షణ్ హాళ్ల పైనే ఆధారపడ్డాయి. నివాస ప్రాంతాల్లో చోటు లేకపోవడం వల్ల పేద, మధ్య, ధనవంతుల కుటుంబాలు సైతం తాము తాము నిర్వహించుకునే దావతులను ఇట్టి ఫంక్షన్ హాల్లో నే చేపట్టేందుకు చాలు చూపుతున్నారు.

అవసరానికి అనుగుణంగా ఫంక్షన్ హాల్ లో  నిర్వహించుకోవడం సరైనదే. కానీ, ఫంక్షనాళ్లకు ఏర్పాటుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి విషయంలో ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు ఏమాత్రం నిబంధనలు పాటించలేకపోతున్నారు. ఆ దిశగా పోలీస్ శాఖ సైతం దృష్టి పెట్టలేకపోతోంది. పొల్యూషన్ జరుగుతుందంటూ వాహనాలపై జరిమానాలు వేస్తున్న పోలీసులు, ఫంక్షన్ హాల్ లో శబ్ద కాలుష్యంపై ఎందుకు నిర్లక్ష్యం చూపు తు న్నారన్న ఆరోపణ స్థానికుల నుండి వినిపిస్తోంది. 

జనావాసాల్లో రచ్చ రచ్చ..

జనావాసాల్లో ఏర్పాటైన ఫంక్షణాలలో జరుగుతున్న సందడి రచ్చ రచ్చగా మారుతుంది. దద్దరిల్లే సౌండ్లతో స్థానికులు చెవులు మూసుకుని కాలం వెలదీసే పరిస్థితి ఏర్పడింది. హాలులో సిట్టింగులు సైతం జోరుగా సాగుతున్నాయి. మద్యం మత్తులో ఎవరించేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి దాపురిస్తుంది. 

మోత మోగుతున్న డీజేలు..

ఫంక్షన్ హాల్లో మోగుతున్న డిజేలు  దావత్ కు హాజరైన వారిని కాకుండా చుట్టుపక్కల ఉన్న వారిని సైతం దడ పుట్టిస్తున్నాయి. అధిక సౌండ్ లతో డీజేలు పెట్టడం వల్ల శబ్ద కాలుష్యంతో  ఉదయం నుండి తెల్ల జాము వరకు కూడా  స్థానికులకు కంటికి కునుకు లేకుండా పోతుంది. డీజే ల వల్ల గుండెపోటు వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబ్ద కాలుష్యంతో వారి గుండె దడ కొట్టుకోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు ఆందోళన గురవుతున్నారు. స్థానికులు ఇంట్లో, వ్యాపారాల్లో ఉండి లావాదేవీలు నడుపుకోవాలన్న, ఫోన్లో సంభాషించాలన్న, కస్టమర్లతో మాట్లాడాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం అవుతుంది.

అర్ధరాత్రిలో హంగామా..

ఉదయం పెళ్లిళ్లు జరిగితే సాయంత్రం 6 గంటల వరకు ఫంక్షనాలను ఖాళీ చేసే పరిస్థితి ఉంటుంది. రాత్రి ఫంక్షన్లు  జరిగితే 11 నుండి 12 గంటల లోపు ఫంక్షన్ హా ళ్లను మూసివేయాల్సిన నిబంధన ఉంది. 12 దాటాక ఫంక్షన్ హాల్లో ఎలాంటి శబ్ద కాలుష్యం కానీ, డీజే లు కానీ, డాన్సులు కానీ, బ్యాండ్ మేళాలు కానీ  వినియోగించుకునే పరిస్థితి ఉండదు. శబ్ద కాలుష్యంతో  స్థానికులకు ఎన్నో అనారోగ్య వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటూ వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా పలు రకాల వ్యాధులు సంక్రమించవచ్చని చెబుతున్నారు. శబ్ద కాలుష్యంతో చెవుడు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

ఇస్టారీతిన ఫంక్షన్ హాల్ ల ఏర్పాటు..

జనావాసాల్లో కాకుండా పట్టణ శివారు ప్రాంతాలు, జనావాసా లేని ప్రాంతాల్లో మాత్రమే ఫంక్షణాలను ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. కానీ ప్రస్తుతం ఇష్టారితిన ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి నిర్వహణ చేపట్టడం జరుగుతుంది.ఫంక్షన్లో పెట్టే డిజేలు, బ్యాండ్ల సౌండ్ లు, కేరింతలు, నృత్యాలు ఎవరికి సమస్యగా ఉండదు. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవన్న విమర్శలు ఉన్నాయి.ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయాలంటే ఈవెంట్ కు వచ్చే వారికి పార్కింగ్ తప్పనిసరిగా ఉండాలి.

పార్కింగ్ స్థలాన్ని మినహాయించి మాత్రమే ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకోవాలి. కానీ అలా ఎక్కడ జరగడం లేదు. ఫంక్షన్ ఉందంటే చాలు.. రోడ్డుకి ఇరువైపులా కార్లు, ద్విచక్ర వాహనాలు, టూరిస్ట్ బస్సులతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రధాన రహదారి గుండా ప్రయాణం చేసే భారీ వాహనాలు, ద్విచక్ర వాహనదారులు, పాదాచార్లు సైతం ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.