3 August, 2026 | 9:47 AM

కాంగ్రెస్ హయాంలోనే ఎల్బీనగర్ నియోజకవర్గానికి భారీగా నిధులు

03-08-2026 08:41 AM

టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ 

ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం  ఎల్బీనగర్ నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేసిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్(TPCC Campaign Committee Chairman Madhu Yaskhi Goud) అన్నారు.‌ బీఎన్ రెడ్డి నగర్ ఉమ్మడి డివిజన్ లోని శ్రీనివాస కాలనీలో రూ. 81 లక్షలతో మంజూరైన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయగా, రూ, 9 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాజీ కార్పొరేటర్లు ముద్దులచ్చిరెడ్డి, లక్ష్మీ ప్రసన్న గౌడ్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ...  సీఎం రేవంత్ రెడ్డి తన సొంత కొడంగల్ నియోజకవర్గం మాదిరిగా  ఎల్బీనగర్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

శివారు కాలనీలన్నింటిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జోనల్ కమిషనర్ తో సమావేశమై రోడ్లు, ఇతర అభివృద్ధి పనులపై సమీక్షించామని, త్వరలో కొత్త రోడ్ల కోసం నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో సామాజిక భద్రత లభిస్తుందని, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్పా.. మిగతా సమయంలో అభివృద్ధి లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మకుటం సదాశివుడు, డివిజన్ల అధ్యక్షులు  కేతావత్ రమేష్ నాయక్, పర్వతి గణేష్ రెడ్డి, శ్రీనాథ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, నాయకులు కొండోజు శ్రీనివాస్, స్వర్ణమాధవి, కుట్ల నర్సింహా యాదవ్, విద్యా రెడ్డి, సూర్యనారాయణ, శశికాంత్, నందకిశోర్, శ్రీనివాస కాలనీ అధ్యక్షుడు చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు.