3 August, 2026 | 9:01 AM

జ్వరంతో బాలుడు మృతి

03-08-2026 08:29 AM

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): ఆళ్లపల్లి మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలోని గొట్టికోయ గుంపుకు చెందిన మాడ్ దేవ (9) 5 వ తరగతి పూర్తి చేసాడు. పై చదువులకు వెళ్లాల్సిన బాలుడు. అవగాహన లేక ఇంటి దగ్గరే ఉండిపోయాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవ కీ గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరం రావడం , సరైన సమయంలో వైద్యం అందక పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో సరైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, సకాలంలో సరైన వైద్యం అందక,  బాలుడి ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు.. జిల్లా వైద్య శాఖ స్పందించి తక్షణం సింగారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.