calender_icon.png 18 January, 2026 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారం ప్రాజెక్టు టూరిజానికి నిధులు మంజూరు

18-01-2026 09:15:42 PM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఎన్నో రోజుల నుండి హైదరాబాద్కు అతి దగ్గరగా ఉండి అప్పటినుండి ఇప్పటివరకు పోచారం ప్రాజెక్టు నాగిరెడ్డిపేట మండలం ప్రజలకు రైతులకు జీవన నాడీలాగా పనిచేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. పోచారం ప్రాజెక్టు టూరిజంగా డెవలప్ చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.

కనుక టూరిజం శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావును పోచారం ప్రాజెక్టుకు తీసుకువచ్చి పోచారం ప్రాజెక్టులో ఉన్నటువంటి హైలాండ్ను సుందరికాంగా చేసి పోచారం ప్రాజెక్టు ప్రాంతమంతా అందంగా డెవలప్ చేయాలని ప్రాజెక్టు ప్రాంతంలో బేసిక్గా పార్కింగ్, రోడ్స్,టాయిలెట్స్,డెవలప్ చేయాలని, గత 20 ఏళ్లుగా పోచారం ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా ఎత్తలేరని దాంట్లో భాగంగా స్పెషల్ నిధుల నుండి గత సంవత్సరం నుండి అందరం కలిసి ప్రయత్నం చేస్తూ మూడు కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు.

అలాగే ఎన్నో సంవత్సరాలుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం మహిమ గల దేవాలయం అని ఇలాంటి డెవలప్ కాకపోవడంతో ఆర్ కాలేజీ నుండి కూడా మాట్లాడడం జరిగిందని దాంట్లో భాగంగా త్రిలింగేశ్వర ఆలయం అభివృద్ధి కొరకు నాలుగు ఐదు కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరగా 77 లక్షలు టూరిజం నుండి మంజూరు కావడం జరిగిందన్నారు.

త్రిలింగేశ్వర ఆలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నందున అక్కడ కూడా ఇలాంటి వసతులు లేకపోవడంతో 77 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత వర్షాకాలంలో అలాగే అకాల వర్షాల కారణంగా నిజంసాగర్ బ్యాక్ వాటర్ ద్వారా పంటలు మునిగిపోయి రైతులు ఎంతో నష్టపోయారని దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లడం జరిగిందన్నారు. మంజీరా నది అభివృద్ధి కొరకు రెండు కోట్ల ఎనిమిది లక్షలు నిధులు మంజూరు అయ్యాయన్నారు.

అలాగే నాగిరెడ్డిపేట్ మండలంలో అతి ముఖ్యమైనది గిడ్డంగులు నాగిరెడ్డిపేట మండలంలో రైతులు 99% వ్యవసాయంపై ఆధారపడతారని ఎక్కువ పంటలు సాగు చేయడం జరుగుతుందని సరైన గోదాములు గిడ్డంగులు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో ఉంచుకొని మాల్తుమ్మెద గ్రామ పరిధిలో జాతీయ రహదారి ఆనుకుని పది ఎకరాలలో 20 వేల మెట్రిక్ టన్నుల గోదాం కొరకు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా 16 కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు. తొందరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు.