18-01-2026 09:10:30 PM
నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
కొల్చారం,(విజయక్రాంతి): యువకులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన కోనాపూర్ ప్రీమియర్ లీగ్–2 క్రికెట్ పోటీల విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు టాస్ వేసి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
కోనాపూర్ గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మల మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్రీడలతో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. ఉద్యోగస్తులు, యువత ఆన్‌లైన్ మోసాల పట్ల ఆకర్షితులు కాకుండా క్రీడలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కొల్చారం మండలంలో క్రీడలను ప్రోత్సహిస్తున్న యువ నాయకుల కృషి అభినందనీయమన్నారు. మండల వ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న బీఆర్‌ఎస్ యువత అధ్యక్షుడు సంతోష్ రావు కృషిపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌర్‌శంకర్ గుప్తా, మండల టీఆర్‌ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, పైత్తర సర్పంచ్ యాబన్నగారి రవితేజ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు దొడ్ల ఆంజనేయులు, మోత్కు నిర్మల మల్లేశం, పుర్ర కాంతమ్మ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీలు శ్రీనివాస్ రెడ్డి, ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్, ఉపసర్పంచ్ మురళీధర్ రావు, మాజీ ఉపసర్పంచ్ సుకన్య మధుసూదన్ రెడ్డి, విజయ నర్సింలు, మాజీ సర్పంచ్ రమేష్, గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు భాగయ్య, నర్సాపూర్ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.