లెనిన్ మరింత ఆలస్యం
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. మనం ఎంటర్‌ప్రై జెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే ఆ తేదీ ఇప్పుడు మారింది. సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగార్జున తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
‘లెనిన్’ సినిమాను థియేటర్లలో చూసే ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు మంచి ఔట్‌పుట్ అవసరమని, మూవీటీమ్ అందుకు కష్టపడుతోందని ఆయన తెలియజేశారు. దానికోసం మరింత సమయం కావాలని, అందుకే రిలీజ్ డేట్‌ను జూలై 10కి మార్చామని పేర్కొన్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానా యికగా నటిస్తున్న ఈ సినిమాలో శివాజీ ముఖ్యపాత్రలో కనిపించను న్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల.






