'ఆశ 'స్కీమ్ మెంబర్లుగా గాజుల రామమూర్తి, షాహజాన్ పర్వీన్
19-06-2026 08:09 PM
షాహజాన్ పర్వీన్
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆశ' స్కీమ్ నందు ప్యానెల్ న్యాయవాదులుగా సీనియర్ న్యాయవాదులు గాజుల రామమూర్తి, షాహజాన్ పర్వీన్ లను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత నియమించారు. వీరు బాల్యవివాహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాగించెదరు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలను అరికట్టడం, బాధిత బాలికలకు సహాయము అందించడం, అవసరమైన న్యాయ పరిరక్షణ కల్పించడం, అలాగే ప్రజలలో చట్టపరమైన అవగాహన పెంపొందించడం లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి. అవసరమైన సందర్భంలో తక్షణ చర్యలకు సమన్వయం చేయడంలో తమ తమ సేవలను అందించనున్నారు.






