19 June, 2026 | 10:25 PM

అంగన్వాడి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్ దున్నా

19-06-2026 09:01 PM

కోదాడ,(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని  నడిగూడెం గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం నడిగూదెం మండల కేంద్రంలోని 3,4 అంగన్వాడీ కేంద్రాలలో  విద్యార్థులకు ఐసిడిఎస్ ద్వారా అందించిన చేసిన ఏకరూప దుస్తులను శుక్రవారం పంపిణీ చేసారు. అనంతరం మాట్లాడుతూ... అంగన్వాడీ విద్యార్థులకు గతంలో  ప్రభుత్వాలు దుస్తులు పంపిణీ చేయలేదని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అంగన్వాడీ విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు పంపిణీ చేయడంతో పాటు బలమైన పౌష్టికాహారం అందించేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంగన్వాడి సెంటర్లలో అందిస్తున్న సేవలను ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులను కోరారు.