గాలివాంట్ బౌలింగ్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, మే 18: ఇండోర్ గేమ్స్‌లో బౌలింగ్‌కు భారత్‌లో కూడా ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లో చాలా కాలంగా బౌలింగ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మాల్స్‌లో మంచి క్రేజ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు వీటిపై దృష్టి పెట్టాయి. తాజాగా బండ్లగూడ సన్‌సిటీలో గాలివాండ్ బౌలింగ్ అండ్ గేమింగ్ సెంటర్ ప్రారంభమైంది. తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బి.జ్ఞానేశ్వర్ ముదిరాజ్ దీనిని ప్రారంభించారు. గతంలో ఆటవిడుపు కోసం బౌ లింగ్ ఆడినా క్రమంగా కెరీర్‌గా కూడా ఎంచుకుంటున్నారు.
దీనిలో భాగంగానే గాలివాంట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ హైదరాబాద్‌లో బౌలింగ్ సెంటర్స్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే జూబ్లీహిల్స్, గచ్చిబౌలీలో సెంటర్స్ ఏర్పా టు చేయగా, బండ్లగూడలోనూ బౌలింగ్, గేమింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. కేవలం కార్పొరేట్ ఉద్యోగుల కోసమే కాకుండా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా బౌలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంపై నిర్వాహకులకు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అభినందనలు తెలిపారు. బౌలింగ్ సెంటర్ మాత్రమే కాకుండా గేమింగ్‌కు సంబంధించి చాలా ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయని గాలివాంట్ నిర్వాహకులు తెలిపారు.






