10 July, 2026 | 3:29 PM

యువత వ్యాయామంతో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలి

10-07-2026 02:30 PM

నేరేడుచర్ల వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి

నేరేడుచర్ల,(విజయ క్రాంతి ): యువత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనే లక్ష్యంతో రావుల స్వరూప్ ఏర్పాటు చేసిన జాసన్ ఫిట్నెస్ సెంటర్ ను నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ... యువత వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డ్రగ్స్, చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టాలన్నారు. ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ ఫిట్నెస్ సెంటర్ స్థానిక యువతకు ఎంతో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, రాపోలు నవీన్, ఎస్.కె హుస్సేన్, ఫిలిప్, లంజపల్లి రవి     స్థానిక ప్రముఖులు, యువకులు, ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.