30 May, 2026 | 1:39 AM

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంప శ్రీనివాస్ నియామకం

30-05-2026 01:06 AM

సిద్దిపేట క్రైం, మే 29 :  ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు గంప శ్రీనివాస్ నియామకమయ్యారు. శుక్రవారం హైదరాబాద్ చింతల్ బస్తీలోని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్య క్రమంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన లక్ష్మీనారా యణకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి, స్వయం ఉపాధికి ఆర్థిక సహకారం అందించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తణుకు ఆంజనేయులు, జిల్లా మాజీ అధ్యక్షులు అయిత రత్నాకర్, మంచా ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సముద్రాల హరినాథ్, జిల్లా కోశాధికారి మంకాల నవీన్ కుమార్, జిల్లా మాజీ ప్రధా న కార్యదర్శి తడక లింగమూర్తి పాల్గొన్నారు.